గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.260 కోట్లు

ABN , First Publish Date - 2021-05-18T05:59:26+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా రూ.260.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.260 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా రూ.260.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.194.8 కోట్లతో పోలిస్తే 34 శాతం పెరిగినట్లు గ్లాండ్‌ ఫార్మా సీఈఓ, ఎండీ శ్రీనివాస్‌ సాదు తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 37 శాతం వృద్ధితో రూ.681.4 కోట్ల నుంచి  రూ.935 కోట్లకు చేరింది. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,597.7 కోట్ల ఆదాయంపై రూ.997 కోట్ల లాభాన్ని ఆర్జించింది.  కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ  రూ.289 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 

Updated Date - 2021-05-18T05:59:26+05:30 IST