బుక్ చేసుకున్న గంటలోనే... గ్యాస్ డెలివరీ...

ABN , First Publish Date - 2021-01-13T22:19:11+05:30 IST

బుక్ చేసుకున్న గంటలోనే గ్యాస్ సిలిండర్... ఇంటికి డెలివరీ అవుతుంది. నమ్మలేకపోతున్నారా ? ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. బుక్ చేసుకున్న గంటలనో గ్యాస్ సిలిండర్ ను డెలివరీ చేసేందుకు... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తత్కాల్ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

బుక్ చేసుకున్న గంటలోనే... గ్యాస్ డెలివరీ...

హైదరాబాద్ : బుక్ చేసుకున్న గంటలోనే గ్యాస్ సిలిండర్... ఇంటికి డెలివరీ అవుతుంది. నమ్మలేకపోతున్నారా ? ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. బుక్ చేసుకున్న గంటలనో గ్యాస్ సిలిండర్ ను డెలివరీ చేసేందుకు... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తత్కాల్ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తత్కాల్ సేవలనందించే క్రమంలో... ప్రతీ రాష్ట్రంలోనూ కనీసం ఒక పట్టణం లేదా జిల్లాను గుర్తించనున్నారు. 


ఈ క్రమంలో... వినియోగదారులకు గ్యాస్ బుక్ చేసుకున్న 30-40 నిమిషాల్లోనే సిలిండర్‏ను అందిస్తామని ఐఓసీఎల్ వెల్లడించింది. అయితే... తత్కాల్ సేవలు ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తాయన్నది మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఖాతాదారులు 14 కోట్ల మంది వరకు ఉన్నారు. ఇప్పటీకే... ఇండియన్ ఆయిల్ తన వినియోగదారులకు ఇండేన్ గ్యా్స్ రూపంలో ఎల్‏పీజీ గ్యాస్ సిలిండర్ సర్వీసులు అందుతున్నాయి. కాగా... సింగిల్ సిలిండర్ ఉపయోగించేవారికి తత్కాల్ సేవతో భారీ ఊరట లభించనుంది. 

Updated Date - 2021-01-13T22:19:11+05:30 IST