పబ్లిక్‌ ఇష్యూకి ఫ్రీడమ్‌ ఆయిల్‌

ABN , First Publish Date - 2021-08-10T09:22:13+05:30 IST

‘ప్రీడమ్‌’ బ్రాండ్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతా ల్లో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎ్‌ఫఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోం ది.

పబ్లిక్‌ ఇష్యూకి ఫ్రీడమ్‌ ఆయిల్‌

  • రూ.2,500 కోట్ల సమీకరణ.. 
  • ఓఎఫ్ఎస్‌ ద్వారా వాటాదారుల షేర్ల విక్రయం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ‘ప్రీడమ్‌’ బ్రాండ్‌తో  తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతా ల్లో  వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎ్‌ఫఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోం ది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించనుంది. ఓఎ్‌ఫఎ్‌సలో వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు. కంపెనీ తాజాగా ఎటువంటి ఈక్విటీని జారీ చేయదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసాల్లో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ మార్కెట్లో కంపెనీ అగ్రగామిగా ఉంది. 2010లో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. సన్‌ఫ్లవర్‌, రైస్‌బ్రాన్‌, పామాయిల్‌ను రిటైల్‌ మార్కెట్లో విక్రయించడంతో పాటు పారిశ్రామిక వినియోగదారులకు హై స్టేబుల్‌ ఫ్రైయింగ్‌ వంట నూనెలను విక్రయిస్తోంది. 2018-19 నుంచి 2020 -21 మధ్య  కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం ఏటా 19.6 శాతం పెరిగిందని తెలిపింది.


ఉత్తరాదిలోకి అడుగు పెట్టే యోచన

వచ్చే ఐదేళ్లలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని చత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోకి అడుగు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. తమిళనాడు, కేరళల్లో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిసా, కర్ణాటక రాష్ట్రాల్లో 640 పట్టణాల్లో ‘ప్రీడమ్‌’ బ్రాండ్‌ వంట నూనెలు లభ్యమవుతున్నాయి. దేశంలోని ఐదు అతిపెద్ద వంటి నూనెల బ్రాండ్లలో ఒకటిగా ఉంది. జీఈఎఫ్‌ఐఎల్‌ను ప్రమోట్‌ చేసిన గోల్డెన్‌ అగ్రి రీసోర్సెస్‌ సింగపూర్‌ ఎక్స్ఛేంజీలో నమోదై ఉంది. 

Updated Date - 2021-08-10T09:22:13+05:30 IST