భారత్‌లో ఫాక్స్‌కాన్‌ కార్ల తయారీ

ABN , First Publish Date - 2021-10-21T08:01:12+05:30 IST

తైవాన్‌కు చెందిన ఎలక్ర్టానిక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ ప్రారంభించే అవకాశం ఉంది.

భారత్‌లో ఫాక్స్‌కాన్‌ కార్ల తయారీ

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఎలక్ర్టానిక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ ప్రారంభించే అవకాశం ఉంది. బుధవారం మూడు విద్యుత్‌ కార్ల ప్రొటోటై్‌పలు ఆవిష్కరించిన సందర్భంగా ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ లీయూ యంగ్‌ మాట్లాడు తూ.. భారత్‌ సహా యూరప్‌, లాటిన్‌ అమెరికా (మెక్సికో) దేశాల్లో కార్ల తయారీ చేపట్టే విషయం పరిశీలిస్తున్నట్టు చెప్పా రు. అలాగే జర్మనీ కార్ల కంపెనీలకు పరోక్షంగా సహకరిస్తామన్నారు. కార్ల తయారీ లో భాగంగా అమెరికన్‌ స్టార్టప్‌ ఫిస్కర్‌, థాయ్‌లాండ్‌ ఎనర్జీ గ్రూప్‌ పీటీటీ పీసీఎల్‌తో సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. తమ తొలి ప్రాధాన్యత యూరప్‌ అని, ఆ తర్వాత భారత్‌, లాటిన్‌ అమెరికా తదుపరి గమ్యమని చెప్పారు. బిల్డ్‌, ఆపరేట్‌, లోకలైజ్‌ విధానంలో ఆయా దేశాల్లో తాము కార్ల ఉత్పత్తి చేపడతామన్నారు.

Updated Date - 2021-10-21T08:01:12+05:30 IST