ఆ జాబితాలో... ఐదు భారత కంపెనీలు...

ABN , First Publish Date - 2021-12-16T01:21:24+05:30 IST

భారత్‌కు చెందిన అయిదు బ్రాండ్లకు... ప్రపంచంలోని టాప్ 100 విలాస ఉత్పత్తుల కంపెనీల జాబితాలో చోటుదక్కింది.

ఆ జాబితాలో... ఐదు భారత కంపెనీలు...

ముంబై : భారత్‌కు చెందిన అయిదు బ్రాండ్లకు...  ప్రపంచంలోని టాప్ 100 విలాస ఉత్పత్తుల కంపెనీల జాబితాలో  చోటుదక్కింది. డెలాయిట్ గ్లోబల్ సంస్థ... ఈ ఏడాదికి సంబంధించి విడుదల చేసిన లగ్జరీ బ్రాండ్ల  జాబితాలో టాటా గ్రూపునకు చెందిన టైటాన్ 22 వ స్థానంలో నిలిచింది(ఇంతకుముందుకంటే... మూడు స్థానాలు ఎగబాకింది). అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇరవై లగ్జరీ గూడ్స్ కంపెనీల్లో టైటాన్ ఒకటిగా నిలవడం విశేషం. 


భారత్‌‌కు ఈ జాబితాలో చోటు లభించడంతో పాత్ర పోషించిన లగ్జరీ బ్రాండ్లలో... కళ్యాణ్ జ్యువెలర్స్(37 వ స్థానం), జోయ్-అలుక్కాస్(46), పీసీ జువెలర్స్(57), త్రిభువన్‌దాస్ భీంజీ జవేరీ లిమిటెడ్(92) కంపెనీలున్నాయి. ఇక... దేశీయ కంపెనీల్లో అన్నీ జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి చెందినవే కావడం గమనార్హం. కాగా... త్రిభువన్‌దాస్‌కు ఈ జాబితాలో చోటు లభించడం ఇదే మొదటిసారి. జాబితాలోని కంపెనీల మొత్తం ఆదాయం కిందటి సంవత్సరం  25,200 కోట్ల డాలర్లుగా నమోదైంది.


ఇదిలా ఉంటే... టాప్ 100 లగ్జరీ జాబితాలో చోటు దక్కించుకున్న భారత్‌ కంపెనీలు టైటాన్, కళ్యాణ్ జెవెలర్స్స సంస్థలు... 2019 లో ఆర్జించిన $ 28,100 కోట్లతో పోలిస్తే... ఈ దఫా మాత్రం ఆర్జన గణనీయంగా తగ్గినట్లు డెలాయిట్ పేర్కొంది. కరోనా సంక్షోభం  ప్రభావమే ఇందుకు కారణమని పేర్కొంది. ఎల్‌వీఎంహెచ్... ప్రపంచంలో అత్యంత విలాస బ్రాండ్‌గా నిలిచింది. కెరింగ్ ఎస్ఏ, ది ఎస్టీ లాడర్ కంపెనీస్ ఇంక్, కంపెనీ ఫైనాన్షియర్ రిచ్‌మోంట్ ఎస్ఏ, లోరియల్ లక్సీ టాప్-5 స్థానాల్లో నిలిచాయి. 

Updated Date - 2021-12-16T01:21:24+05:30 IST