డిజిటల్ పేమెంట్స్‌లో... తొలి ‘ఆరోగ్య బీమా’... ఫోన్‌పే ఆఫర్...

ABN , First Publish Date - 2021-12-19T22:14:37+05:30 IST

వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘ఫోన్‌పే’... తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

డిజిటల్ పేమెంట్స్‌లో... తొలి ‘ఆరోగ్య బీమా’... ఫోన్‌పే ఆఫర్...

హైదరాబాద్ : వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘ఫోన్‌పే’... తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 999 కే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మొదటిసారి ఆరోగ్య బీమా కొనుగోలు చేసే వారికి...  ‘హెల్త్@999’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇన్సూరెన్స్ ప్లాన్  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫోన్‌పే తెలిపింది. ఈ విషయాన్ని ఫోన్‌పే ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. 


ఈ కొత్త ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేందుకుగాను... వినియోగదారులు కేవలం తమ బేసిక్ వివరాలను అందిస్తే సరిపోతుందని ఫోన్‌పే చెప్పింది. ఈ ప్లాన్ కొనుగోలు చేసేందుకు కేవలం మూడు నాలుగు స్టెప్స్ మాతమే అవసరమవుతాయని తెలిపింది. ఇకఈ బీమా ప్రొడక్టు ప్రత్యేకత ఏమిటంటే... మూడు నాలుగు స్టెపుల ప్రక్రియలో బీమా కొనుగోలుదారు అవసరమైన వివరాలను అందజేయడం. ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే కస్టమర్లు పేరు, వయసు, జెండర్, ఈమెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలనందిస్తే సరిపోతుంది. ‘కొత్తగా బీమా పాలసీ కొనుగోలు చేసే యువత ఎదుర్కొంటోన్న కలగాపులగంగా ఉండే ప్రక్రియలను ఈ పాలసీ ద్వారా తొలగించాం’ అని ఫోన్‌పే తెలిపింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 

తక్కువ ధరలోనే ఎక్కువ సర్వీసులను ‘హెల్త్@999’ అందజేస్తోంది. ఈ పాలసీ ఆఫర్ చేసే సర్వీసుల్లో... ఇన్-పేషెంట్, ఐసీయూ హాస్పిటలైజేషన్, డేకేర్ ప్రొసీజర్స్, అంబులెన్స్ చార్జీలు, ఆయుష్ ట్రీట్‌మెంట్ వంటి ఆసుపత్రి ఖర్చులున్నాయి. దేశవ్యాప్తంగా 7600 ఆసుపత్రుల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. హెల్త్@999 పాలసీ ఫోన్‌పే ద్వారా ఇన్‌స్టాంట్‌గా అందుబాటులో ఉందని, జీవితకాల రెన్యూవబుల్ ఫీచర్‌తో ఈ పాలసీ వచ్చిందని ఫోన్‌పే తెలిపింది.

Updated Date - 2021-12-19T22:14:37+05:30 IST