ఫావీపిరావిర్.. ఓరల్ సస్పెన్షన్ రూపంలో! లాంచ్ చేసిన ఎఫ్‌డీసీ

ABN , First Publish Date - 2021-07-13T04:12:13+05:30 IST

భారతీయ ఫార్మా సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ ఫావీపిరావిర్ యాంటీ వైరల్ ఔషధాన్ని భారత్‌లో తొలిసారిగా ఓరల్ సస్పెన్షన్ రూపంలో మార్కెట్‌లోకి తెచ్చింది.

ఫావీపిరావిర్.. ఓరల్ సస్పెన్షన్ రూపంలో! లాంచ్ చేసిన ఎఫ్‌డీసీ

ముంబై: భారతీయ ఫార్మా సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ ఫావీపిరావిర్ యాంటీ వైరల్ ఔషధాన్ని భారత్‌లో తొలిసారిగా ఓరల్ సస్పెన్షన్ రూపంలో మార్కెట్‌లోకి తెచ్చింది. ఫవెంజా పేరిట తాజాగా లాంచ్ చేసింది. దేశంలోని అన్ని మెడికల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉందని సంస్థ పేర్కొంది. ఫవెంజా టానిక్ రూపంలో ఉండటంతో వినియోగదారులు సులువుగా కావాల్సిన మోతాదులో ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఉదయం 15 ఎమ్ఎల్ సాయంత్రం 18 ఎమ్‌ఎల్ చొప్పున తీసుకునే ఫవెంజా డోసు ఫెవిపిరావిర్ 400 ఎమ్‌జీ తొమ్మిది టాబ్లెట్లతో సమానమని కంపెనీ తెలిపింది. కరోనా చికిత్స మరింత సౌకర్యవంతగా మార్చడమే తమ లక్ష్యమని ఎఫ్‌డీసీ బిజినెస్ డెవలప్‌మెంట్, కమర్షియల్ ఎక్సెలెన్స్ శాఖ జనరల్ మేనేజర్ మయాంక్ టిక్కా తెలిపారు. 

Updated Date - 2021-07-13T04:12:13+05:30 IST