ఫేస్‌బుక్‌ కొత్త పేరు మెటా!

ABN , First Publish Date - 2021-10-29T08:47:58+05:30 IST

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల నిర్వహణ సంస్థ ఫేస్‌బుక్‌ ఇంక్‌ పేరు మార్చుకుంది.

ఫేస్‌బుక్‌ కొత్త పేరు మెటా!

ఓక్లాండ్‌(అమెరికా): ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల నిర్వహణ సంస్థ ఫేస్‌బుక్‌ ఇంక్‌ పేరు మార్చుకుంది.  బ్రాండ్‌నేమ్‌ను ‘మెటా’గా మార్చుతున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ గురువారం ప్రకటించారు. ప్రస్తుత బ్రాండ్‌నేమ్‌ కంపెనీ కార్యకలాపాలన్నింటినీ ప్రతిబింబించేలా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరు 1 నుంచి అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఫేస్‌బుక్‌ షేరు ఎంవీఆర్‌ఎస్‌ పేరుతో ట్రేడవనుంది. 

Updated Date - 2021-10-29T08:47:58+05:30 IST