పీఎన్‌బీ చీఫ్‌ పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2021-08-27T06:39:56+05:30 IST

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఎండీలు, సీఈఓల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

పీఎన్‌బీ చీఫ్‌ పదవీ కాలం పొడిగింపు

న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఎండీలు, సీఈఓల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఎండీ, సీఈఓగా ఉన్న ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు పొడిగించింది. అప్పటికి ఆయన వయోపరిమితి కారణంగా రిటైర్‌ అవుతారు. నియామకాల కేంద్ర కేబినెట్‌ (ఏసీసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. మల్లిఖార్జున రావుతో పాటు యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అతుల్‌ కుమార్‌ గోయల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ ఏఎస్‌ రాజీవ్‌ పదవీ కాలాన్నీ ప్రభుత్వం పొడిగించింది. అయితే వీరిద్దరి పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగిస్తున్నట్టు తెలిపింది. వీటికి తోడు పీఎ్‌సబీల్లో పని చేస్తున్న పది మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల పదవీ కాలాన్నీ పొడిగించారు.

Updated Date - 2021-08-27T06:39:56+05:30 IST