కరోనా నేపధ్యంలోనూ... పెరిగిన కొత్త కంపెనీలు...

ABN , First Publish Date - 2021-07-20T22:24:03+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ ఊపందుకున్న దశలోనూ భారత్‌లో కొత్త కంపెనీలు భారీగానే పెరిగాయి.

కరోనా నేపధ్యంలోనూ... పెరిగిన కొత్త కంపెనీలు...

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఊపందుకున్న దశలోనూ భారత్‌లో కొత్త కంపెనీలు భారీగానే పెరిగాయి. సెకండ్ వేవ్ ప్రభావం మార్చిలో ఊపందుకుని దాదాపు జూన్ వరకూ తారస్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. కాగా... ఈ మధ్య కాలంలోనే... అంటే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో దేశీయంగా 17 వేలకు పైగానే కొత్త కంపెనీలు ఏర్పాటు కావడం గమనార్హం.


మొత్తంమీద జూన్‌ ఆఖరు నాటికి యాక్టివ్‌గా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.7 లక్షలకు చేరింది. తాజాగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ కొత్త కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో మొత్తంగా 36,191 కంపెనీలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది కాలంలో 18,968 కొత్త కంపెనీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది కొత్తగా మరో 17,223 కంపెనీలు ఏర్పాటయ్యాయని కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2021-07-20T22:24:03+05:30 IST