మస్క్ వ్యాఖ్యలు, అటుపై చైనా నిర్ణయం... ఫలితం... బిట్ కాయిన్ సహా క్రిప్టో మహాపతనం...

ABN , First Publish Date - 2021-05-20T19:54:59+05:30 IST

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ దారుణంగా పతనమైంది. కిందటి నెలలో ఓ సమయంలో 64 వేల డాలర్ల పైకి చేరిన బిట్‌కాయిన్... ఇప్పుడు ఏకంగా 37 వేల డాలర్ల స్థాయికి పడిపోయింది.

మస్క్ వ్యాఖ్యలు, అటుపై  చైనా నిర్ణయం... ఫలితం... బిట్ కాయిన్ సహా క్రిప్టో మహాపతనం...

బీజింగ్ : క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ దారుణంగా పతనమైంది. కిందటి నెలలో ఓ సమయంలో 64 వేల డాలర్ల పైకి చేరిన బిట్‌కాయిన్... ఇప్పుడు ఏకంగా 37 వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, క్రిప్టో కరెన్సీకి బ్యాంకింగ్ సేవలను చైనా నిలిపివేయడం తదితర పరిణామాల నేపధ్యంలో...  బిట్ కాయిన్ దిగజారిపోయింది.


ఇక... మిగిలిన క్రిప్టోకరెన్సీలకు కూడా ప్రాధాన్యత తగ్గుతున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బిట్ కాయిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది 65 వేల డాలర్ల నుండి 37 వేల డాలర్లకు పడిపోవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో బిట్  కాయిన్ 35 శాతం పతనమై 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది పద్నాలుగు నెలల కనిష్టం. 

Updated Date - 2021-05-20T19:54:59+05:30 IST