కేవీబీలో ప్రత్యక్ష పన్ను చెల్లింపులు

ABN , First Publish Date - 2021-10-14T06:08:32+05:30 IST

సీబీడీటీ తరఫున ప్రత్యక్ష పన్నులను వసూలు చేయడానికి కరూర్‌ వైశ్యా బ్యాంకుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

కేవీబీలో ప్రత్యక్ష పన్ను చెల్లింపులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  సీబీడీటీ తరఫున ప్రత్యక్ష పన్నులను వసూలు చేయడానికి కరూర్‌ వైశ్యా బ్యాంకుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా సీబీడీటీతో వ్యవస్థల అనుసంధానం ప్రక్రియను బ్యాంకు చేపట్టింది. ఇది పూర్తయిన తర్వాత ఖాతాదారులు పన్నులను బ్యాంకు శాఖల్లో, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లేదా డిలైట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించవచ్చని బ్యాంకు ఎండీ బీ రమేశ్‌ బాబు తెలిపారు. 

Updated Date - 2021-10-14T06:08:32+05:30 IST