జేఎల్‌ఆర్ డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్
ABN , First Publish Date - 2021-09-03T06:37:33+05:30 IST
జేమ్స్‌బాండ్ 25వ చిత్రం ‘‘నో టైమ్ టు డై’’ విడుదల సందర్భంగా డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్ రూపొందించినట్టు జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)...

న్యూఢిల్లీ : జేమ్స్‌బాండ్ 25వ చిత్రం ‘‘నో టైమ్ టు డై’’ విడుదల సందర్భంగా డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్ రూపొందించినట్టు జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ప్రకటించింది. కేవలం 300 కార్లు మాత్రమే రిటైల్ విక్రయానికి కంపెనీ అందుబాటులో ఉంచనుంది. ఈ సినిమా సెప్టెంబరు 30వ తేదీన బ్రిటన్, అమెరికాల్లో విడుదల కానుంది. జేఎల్‌ఆర్‌కు జేమ్స్‌బాండ్‌తో 38 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ కారు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటకి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.