‘ఆటో’కి కలిసొచ్చిన డిసెంబరు

ABN , First Publish Date - 2021-01-12T09:32:15+05:30 IST

గత ఏడాది డిసెంబరు నెల ఆటో రంగానికి కలిసొచ్చింది. గత నెలలో దేశవ్యాప్తంగా 2,71,249 ప్రయాణికుల వాహనాలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 23.99 శాతం ఎక్కువని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది.

‘ఆటో’కి కలిసొచ్చిన డిసెంబరు

న్యూఢిల్లీ : గత ఏడాది డిసెంబరు నెల ఆటో రంగానికి కలిసొచ్చింది. గత నెలలో దేశవ్యాప్తంగా 2,71,249 ప్రయాణికుల వాహనాలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 23.99 శాతం ఎక్కువని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. దసరా, దీపావళి నుంచి ప్రారంభమైన కొనుగోళ్లు డిసెంబరులోనూ కొనసాగాయి. కొవిడ్‌, ఇతర కారణాలతో కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వ్యక్తులు కొనుగోళ్లకు దిగడం కూడా ఇందుకు కలిసొచ్చింది. 2019 డిసెంబరుతో పోలిస్తే 2020 డిసెంబరులో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11.88 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగాయి. 


వాణిజ్య వాహన అమ్మకాలు ఢమాల్‌: వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది డిసెంబరులో వీటి అమ్మకాలు 13.52 శాతం పడిపోయాయి. మరోవైపు త్రిచక్ర వాహన అమ్మకాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ కాలంలో వీటి అమ్మకాలు 52.75ు తగ్గి 27,715 యూనిట్లుగా నమోదయ్యాయి. 

Updated Date - 2021-01-12T09:32:15+05:30 IST