ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరిస్తాం
ABN , First Publish Date - 2021-09-03T06:28:33+05:30 IST
రాష్ట్రం నుంచి వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే ఎగుమతిదారుల ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ హామీ...

- సీఎస్ సోమేష్ కుమార్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే ఎగుమతిదారుల ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ హామీ ఇచ్చారు. గురువారం నాడిక్కడ ఎఫ్‌టీసీసీఐ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిలో ఎగుమతిదారులు భాగస్వాములని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తానని సీఎస్ చెప్పారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఊతమిచ్చినట్లవుతుందని, కొవిడ్-19 తదనంతర దశలో రికవరీ వేగాన్ని పెంచినట్లవుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. కాగా రాష్ట్రంలో కంటైనర్ల కొరత ఉందని, ఇది ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని సీఎ్‌సకు ఎగుమతిదారులు వివరించారు. ఎగుమతులు పెంచేందుకు ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ టౌన్‌గా ఏదైనా పట్టణాన్ని నోటిఫై చేయాలని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇన్‌లాండ్ కంటైనర్ డిపోను ఏర్పాటు చేయాలని సూచించారు.