క్రిప్టో ‘బేర్‌’

ABN , First Publish Date - 2021-05-20T05:42:36+05:30 IST

వరుస నష్టాలతో క్రిప్టోకరెన్సీలు బేర్‌మంటు న్నాయి. కార్ల కొనుగోలుకు బిట్‌ కాయిన్‌ను అనుమతించేది లేదని వారం రోజుల క్రితం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటనకు తాజాగా క్రిప్టోలపై చైనా విధించిన ఆంక్షలు మార్కెట్లో కల్లోలం సృష్టించాయి

క్రిప్టో ‘బేర్‌’

40 శాతం వరకు పతనం

రూ.73 లక్షల కోట్ల నష్టం


న్యూయార్క్‌: వరుస నష్టాలతో క్రిప్టోకరెన్సీలు బేర్‌మంటు న్నాయి. కార్ల కొనుగోలుకు బిట్‌ కాయిన్‌ను అనుమతించేది లేదని వారం రోజుల క్రితం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటనకు తాజాగా క్రిప్టోలపై చైనా విధించిన ఆంక్షలు మార్కెట్లో కల్లోలం సృష్టించాయి. తమ ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు క్రిప్టో సేవ లందించడాన్ని చైనా నిషేధించింది. ఫలితంగా క్రిప్టో మార్కెట్‌  భారీ అమ్మకాల ఒత్తిడికి లోను కావడంతో బుధవారం బిట్‌కాయిన్‌ 30 శాతం, ఈథర్‌ 40 శాతం నష్టపోయాయి. ఫలితంగా గత కొద్ది రోజుల వరుస నష్టాల కారణంగా క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ లక్ష కోట్ల డాలర్లు (సుమారు రూ.73 లక్షల కోట్లు) క్షీణించింది. బిట్‌కాయిన్‌ బుధవారం ఒక దశలో 30,001.51 డాల ర్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయికి పతనమయింది. గత నెల 14న నమోదైన 64,895.22 డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం 55 శాతానికిపైగా దిగువన ఉంది. 2020 మార్చి నెల తర్వాత బిట్‌కాయిన్‌ నమోదు చేసిన కనిష్ఠ స్థాయి ఇదే.

Updated Date - 2021-05-20T05:42:36+05:30 IST