కరోనా పూర్వ స్థాయికి మీడియా, వినోద రంగం
ABN , First Publish Date - 2021-12-31T09:08:32+05:30 IST
భారత మీడియా, వినోద రంగం కరోనా పూర్వ స్థాయికి పుంజుకుందని సీఐఐ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సంయుక్త నివేదిక పేర్కొంది.

న్యూఢిల్లీ: భారత మీడియా, వినోద రంగం కరోనా పూర్వ స్థాయికి పుంజుకుందని సీఐఐ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సంయుక్త నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఈ రంగం ఏటా 10-12 శాతం సమ్మిళిత వృద్ధితో 5,500-7,000 కోట్ల డాలర్ల స్థాయికి పెరగవచ్చని రిపోర్టు అంచనా వేసింది. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎ్‌ఫఎక్స్ విభాగాలు భవిష్యత్‌లో భారీగా వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడనుందని తెలిపింది.