ఆ మెసేజ్ యాప్ వాడొద్దు... ఉద్యోగులకు కంపెనీల హెచ్చరిక...
ABN , First Publish Date - 2021-01-12T19:51:51+05:30 IST
వాట్సప్ సంస్థ ఇటీవల తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల డేటా భద్రత, గోప్యతలపై కొద్ది రోజులుగా పలు అనుమనాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా టాటా స్టీల్‌తోపాటు మరికొన్ని సంస్థలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు... వాట్సప్ వాడొద్దంటూ తమ సిబ్బందికి సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్రిటికల్ బిజినెస్ కాల్స్‌కు వాట్సప్ అసలు ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నాయి.

న్యూఢిల్లీ : వాట్సప్ సంస్థ ఇటీవల తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల డేటా భద్రత, గోప్యతలపై కొద్ది రోజులుగా పలు అనుమనాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా టాటా స్టీల్‌తోపాటు మరికొన్ని సంస్థలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు... వాట్సప్ వాడొద్దంటూ తమ సిబ్బందికి సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్రిటికల్ బిజినెస్ కాల్స్‌కు వాట్సప్ అసలు ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నాయి. కారణం... వాట్సప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీస్ నిబంధనల ఆధారంగా పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో డేటా షేర్ చేసుకుంటోందని విమర్శలు వినవస్తోన్న నేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను ఈ మేరకు అప్రమత్తం చేస్తున్నాయి.
ఇక... వాట్సప్ వాడొద్ధంటూ తమ ఉద్యోగులను సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టెంట్లు, కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే... వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ గురించి పార్లమెంటరీ కమిటీచర్చించింది. టాటా స్టీల్ తన ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు వంటి ముఖ్యమైన విషయాలను, అలాగే వ్యాపార సమావేశాలకు సంబంధించిన ఎలాంటి డేటాను వాట్సప్ ద్వారా పంపొద్దని స్పష్టం చేసింది.
ప్రైవసీ పాలసీ ఫీచర్స్‌తో వాట్సప్ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో వీలైనంతవరకు తీసుకుంటుందని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఫెసిలిటీస్, అఫీషియల్ కమ్యూనికేషన్ దీనిపై స్పందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా వాట్సప్ కొత్త నిబంధనలపై టాటా స్టీల్ సంస్థ ఎక్కువగా సైబర్ సెక్యూరిటీపరంగా అప్రమత్తంగానే ఉంది.