వస్తోంది జేఎ్‌సడబ్ల్యూ కాంక్రీట్‌

ABN , First Publish Date - 2021-06-22T05:37:23+05:30 IST

జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్‌ రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ (ఆర్‌ఎంసీ) వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.

వస్తోంది జేఎ్‌సడబ్ల్యూ కాంక్రీట్‌

న్యూఢిల్లీ: జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్‌ రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ (ఆర్‌ఎంసీ) వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ‘‘జేఎ్‌సడబ్ల్యూ కాంక్రీట్‌’’ బ్రాండ్‌ పేరుతో అది చలామణిలోకి వస్తుంది. ఈ వ్యాపారంలోకి తొలి అడుగుగా ముంబైలోని చెంబూరులో తొలి ఆర్‌ఎంసీ యూనిట్‌ను సంస్థ నెలకొల్పింది. కస్టమర్లకు అన్ని రకాల నిర్మాణ  ఉత్పత్తులు అందించే లక్ష్యంలో భాగ ంగా త్వరలోనే వివిధ వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులకు పర్యావరణహితమైన కాంక్రీట్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో జేఎ్‌సడబ్ల్యూ కాంక్రీట్‌ను దక్షిణాది, పడమర ప్రాంతాలన్నింటికీ విస్తరింపచేయడం తమ లక్ష్యమని పేర్కొంది.

Updated Date - 2021-06-22T05:37:23+05:30 IST