సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-10-14T06:04:19+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు.

సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్‌ అవార్డు

వాషింగ్టన్‌ : మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్‌ ఎకో ఫోరం (సీఈఎఫ్‌) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌  ఫర్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌’ అవార్డుకు నాదెళ్ల ఎంపికయ్యారు.  మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రెసిడెంట్‌, వైస్‌ చైర్మన్‌ బ్రాడ్‌ స్మిత్‌, చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ అమి హుడ్‌, చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ లుకాస్‌ జొప్పాలతో కలిసి నాదెళ్ల ఈ అవార్డు అందుకున్నారు. 

Updated Date - 2021-10-14T06:04:19+05:30 IST