కెంప్లాస్ట్ సన్మార్ X ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్

ABN , First Publish Date - 2021-08-10T21:40:37+05:30 IST

ఈ రోజు(మంగళవారం) రెండు సంస్థలు... కెంప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ తమ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం సిద్ధమయ్యాయి.

కెంప్లాస్ట్ సన్మార్ X ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్

చెన్నై : ఈ రోజు(మంగళవారం) రెండు సంస్థలు... కెంప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ తమ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో... వీటి మధ్య యద్ధం నడుస్తోంది. దీంతో... ఏ కంపెనీ ఎక్కువగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ రెండు కంపెనీలు ఎన్ని రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందాయంటే... ఈ రెండు సంస్థలు కలిసి రూ. 14,628 కోట్లకు పైగా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.


బిడ్డింగ్ మొదటి రోజైన్ నేడు కెంప్లాస్ట్ సన్మార్ ఐపీఓ ఉదయం 11 గంటల వరకు 0.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ పోర్షన్ వచ్చేసి 0.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ కోసం, ఇష్యూ 0.06 రెట్లు, రిటైల్ కేటగిరీ బిడ్‌తో 0.11 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి షేర్‌కు రూ. 530-రూ. 541 గా నిర్ణయించింది. కెంప్లాస్ట్ సన్మార్‌కు సంబంధించి రూ. 3,850 కోట్ల ఇష్యూ ద్వారా రూ. 1,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు... రూ. 2,550 కోట్ల ఆఫర్-ఫర్ సేల్ ఉన్నాయి. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 346-353 గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఆగస్టు 12 న ముగియనుంది. 

Updated Date - 2021-08-10T21:40:37+05:30 IST