సీసీఎంబీలో ఎక్సలెన్స్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-12-31T09:09:04+05:30 IST

సీఎ్‌సఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

సీసీఎంబీలో ఎక్సలెన్స్‌ కేంద్రం

ఎస్‌బీఐ ఫౌండేషన్‌ రూ.9.94 కోట్ల విరాళం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సీఎ్‌సఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ జెనోమిక్స్‌ గైడెడ్‌ పాండమిక్‌ ప్రివెన్షన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎస్‌బీఐ ఫౌండేషన్‌ రూ.9.94 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎ్‌సఐఆర్‌-సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరికి ఖారా అందించారు. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సీఎ్‌సఐఆర్‌-సీసీఎంబీతో కలిసి ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని, భారత జినోమ్‌ సీక్వెన్సింగ్‌ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇది దోహ దం చేస్తుందని దినేశ్‌ ఖారా తెలిపారు. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఎండీ మంజులా కళ్యాణసుందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T09:09:04+05:30 IST