క్యాప్‌జెమిని ఉద్యోగాలు... 30 వేల మందికి అవకాశం...

ABN , First Publish Date - 2021-02-26T22:20:57+05:30 IST

ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని సంస్థ... భారత్‌లో ఈ సంవత్సరం 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు వెల్లడించింది. గతేడాది(2020)తో పోలిస్తే... ఇది 25 శాతం అధికం. కరోనా నేపధ్యంలో వ్యాపారావకాశాలు బుల్లిష్‌గా ఉంటాయని ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయనే అంచనాలున్న విషయం తెలిసిందే.

క్యాప్‌జెమిని ఉద్యోగాలు... 30 వేల మందికి అవకాశం...

పారిస్ : ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని సంస్థ... భారత్‌లో ఈ సంవత్సరం 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు వెల్లడించింది. గతేడాది(2020)తో పోలిస్తే... ఇది 25 శాతం అధికం. కరోనా నేపధ్యంలో వ్యాపారావకాశాలు బుల్లిష్‌గా ఉంటాయని ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయనే అంచనాలున్న విషయం తెలిసిందే. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దేశీయ దిగ్గజాలు కూడా కొత్త ఉద్యోగులను గతంలో కంటే ఎక్కువగా తీసుకునే దిశగా సాగుతున్నాయి.


కాగా... ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు క్యాప్‌జెమిని అవకాశం కల్పించనుంది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ, క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్ అండ్ డీ, ఇంజనీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగాల్లో నియమాకలను చేపట్టనున్నట్లు సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా తాజా నియామకాలు... గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ అని క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు.


కోవిడ్ 19 నేపధ్యంలో డిజిటల్ సొల్యూషన్స్‌కు పెరిగిన భారీ డిమాండ్ తమ వ్యాపారావకాశాలను   మెరుగుపరచిందన్నారు. ఇక తాజా నియామకాల్లో...  ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌ అభ్యర్ధులను 50 శాతం చొప్పున తీసుకుంటామన్నారు. 


ఇతర ఐటీ కంపెనీలు కూడా...

డిసెంబరు త్రైమాసికంలో క్యాప్‌జెమిని ఆదాయంలో 65 % వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్ విభాగాలనుండే ఉంది. కరోనా నుండి లుకుంటోన్న నేపధ్యంలో వ్యాపారం మళ్ళీ పుంజుకుంటోందని, భారీ డీల్స్, ప్రాజెక్టులు వస్తాయని సంస్థ భావిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో కరోనా సమయంలోనూ వేతన పెంపు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-02-26T22:20:57+05:30 IST