కస్టమర్ల కాల్స్‌, డేటా రికార్డులు కనీసం రెండేళ్లపాటు భద్రపర్చాలి..

ABN , First Publish Date - 2021-12-25T08:05:57+05:30 IST

టెలికాం కంపెనీలు వినియోగదారుల కాల్స్‌ డేటాతో పాటు ఇంటర్నెట్‌ వినియోగ సమాచారాన్ని తప్పనిసరిగా భద్రపర్చాల్సిన గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది...

కస్టమర్ల కాల్స్‌, డేటా రికార్డులు కనీసం రెండేళ్లపాటు భద్రపర్చాలి..

  • టెలికాం కంపెనీలకు కేంద్రం ఆదేశాలు 

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు వినియోగదారుల కాల్స్‌ డేటాతో పాటు ఇంటర్నెట్‌ వినియోగ సమాచారాన్ని తప్పనిసరిగా భద్రపర్చాల్సిన గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా టెలికాం సేవల కంపెనీలు అన్ని వాణిజ్య, కాల్స్‌, కాల్స్‌ ఎక్స్ఛేంజ్‌లు, ఐపీ సంబంధిత, నెట్‌వర్క్‌ ద్వారా సమాచార మార్పిడి రికార్డులను అవసరం మేర తనిఖీ కోసం కనీసం రెండేళ్ల పాటు భద్రపర్చాల’’ని టెలికాం శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది. ఆ తర్వాత తాము ఎలాంటి నిర్దేశాలు జారీ చేయనిపక్షంలో టెలికాం కంపెనీలు రెండేళ్ల పాటు భద్రపర్చిన రికార్డులను అవసరమైతే తొలగించవచ్చని డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది. 


Updated Date - 2021-12-25T08:05:57+05:30 IST