ఇక్కడ మొబైల్‌ కొంటే ఏడాది పాటు రక్షణ..

ABN , First Publish Date - 2021-01-12T09:22:51+05:30 IST

సంక్రాంతి పండగ లోగా సంగీతాలో మొబైల్‌ కొనుగోలు చేస్తే ఏడాది పాటు బెంగ లేకుండా ఉపయోగించే వెసులుబా టు కల్పించారు.

ఇక్కడ మొబైల్‌ కొంటే ఏడాది పాటు రక్షణ..

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ లోగా సంగీతాలో మొబైల్‌ కొనుగోలు చేస్తే ఏడాది పాటు బెంగ లేకుండా ఉపయోగించే వెసులుబా టు కల్పించారు. సోమవారం నాడిక్కడ సంగీతా మేనేజింగ్‌  డైరెక్టర్‌ ఎల్‌ సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ.. సంగీతాలో మొబైల్‌ కొనుగోలు చేస్తే 30 రోజుల డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ ఉండేదని, అయితే సంక్రాతి కానుకగా దీన్ని ఏడాది పాటు పొడిగించామన్నారు. మొబైల్‌ పగిలిపోతే ఎలాంటి పేపర్‌ వర్క్‌ లేకుండా అక్కడిక్కడే వినియోగదారుడికి కొత్త ఫోన్‌ అందిస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి మొబైల్‌ కొనుగోలుపై దేశంలో ఎక్కడా లేని విధంగా 21 శాతం రాయితీని ఇస్తున్నట్లు చెప్పా రు. పాత ఫోన్‌ మార్చుకుంటే ఎంపిక చేసిన మోడల్స్‌పై 14 వేల అప్‌గ్రేడ్‌ బోనస్‌ అదనంగా అందించనున్నట్లు సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు. సరికొత్త ఎల్‌జీ వింగ్‌ మోడల్‌ సంగీతాలో అందుబాటులో ఉందని, అలాగే ప్రత్యేకమైన కీ బోర్డును ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. సామ్‌సంగ్‌, వివో సహా అన్ని బ్రాండ్స్‌ మొబైల్స్‌పైనా బంపర్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 


700 సంగీతా స్టోర్లలో ఐపాడ్‌, సామ్‌సంగ్‌, లెనోవో ట్యాబ్స్‌, ఎంఐ, రియల్‌మీ, ఒప్పో సహా అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లేకున్నా, సిబిల్‌ స్కోర్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలుపై రుణం ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే 18 జాతీయ బ్యాంకులతో సంగీతా ఒప్పందం చేసుకుందని, క్రెడిట్‌ పాయింట్స్‌ను నగదుగా మార్చుకోవచ్చని సుభాష్‌ చంద్ర అన్నారు. 

Updated Date - 2021-01-12T09:22:51+05:30 IST