ఈ వారం కూడా ముందుకే..

ABN , First Publish Date - 2021-02-08T06:42:31+05:30 IST

ఈ వారం కూడా మార్కెట్లు దూకుడు ధోరణిని కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటనలు వెలువడటంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఫండమెంటల్స్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది...

ఈ వారం కూడా ముందుకే..

ఈ వారం కూడా మార్కెట్లు దూకుడు ధోరణిని కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటనలు వెలువడటంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఫండమెంటల్స్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. నిఫ్టీ అప్‌వర్డ్‌ డైరెక్షన్‌లో సాగితే ఫిబోనకీ స్థాయిలుగా 15050,15200,15400 ఉంటాయి. ఒకవేళ ఏదైనా కరెక్షన్‌ను కనబరిస్తే 14700, 14500 మద్దతు స్థాయిలుగా ఉంటాయి.


స్టాక్‌ రికమండేషన్స్‌

ఐటీసీ: డైలీ చార్టుల ప్రకారం ఈ షేరు బహుళ నిరోఽధాలను అధిగమించి మంచి వాల్యూ మ్స్‌, ధరతో లాభాల్లో సాగుతోంది. గత శుక్రవారం రూ.233.75 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న రోజులకు రూ.250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.215 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

ఐసీఐసీఐ బ్యాంక్‌: కొద్ది రోజులుగా ఈ షేరులో లాభాల స్వీకరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. మున్ముందు కూడా ఇది కొనసాగే అవకాశాలున్నాయి. అయితే కరెక్షన్‌ పెద్దగా కనిపించటం లేదు. గత శుక్రవారం రూ.617.50 వద్ద క్లోజైన ఈ షేరును ఒకవేళ విక్రయించాలనుకుంటే కచ్చితమైన స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఈ షేరు రూ.620-624 స్థాయిలకు బౌన్స్‌ అయితే రూ.585 ధరను టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించే విషయాన్ని ట్రేడర్లు పరిశీలించవచ్చు. రూ.637 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

   - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌ 


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2021-02-08T06:42:31+05:30 IST