బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ స్థిరాస్తుల అమ్మకం షురూ
ABN , First Publish Date - 2021-11-21T05:36:15+05:30 IST
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలైన బీఎ్‌సఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెట్టింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్ (దీపం) వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.....

తొలి దశ ఆస్తుల విక్రయ కనీస ధర రూ.970 కోట్లు
జాబితాలో హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలైన బీఎ్‌సఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెట్టింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్ (దీపం) వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఈ తొలి దశ ఆస్తుల రిజర్వ్ ధర రూ.970 కోట్లు. బీఎ్‌సఎన్‌ఎల్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో ఉన్న 10.96 ఎకరాల స్థలంతోపాటు చంఢీగఢ్, భావ్‌నగర్, కోల్‌కతాలోని స్థిరాస్తులను విక్రయానికి పెట్టిన ప్రభుత్వం.. వాటి రిజర్వ్ ధరను రూ.660 కోట్లుగా నిర్ణయించింది. వసారీ హిల్, ముంబైలోని గోరేగావ్, ఓషివారా ప్రాంతాల్లోని ఎంటీఎన్‌ఎల్ స్థిరాస్తుల కనీస రేటును రూ.310 కోట్లుగా ఖరారు చేసింది. ఆస్తుల విక్రయానికి బిడ్లను ఆహ్వానించడం జరిగిందని, విక్రయ ప్రక్రియను నెలన్నరలో పూర్తి చేయనున్నట్లు బీఎ్‌సఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. బీఎ్‌సఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కోసం రూపొందించిన రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబరులో ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగానే రెండు కంపెనీలకు చెందిన కీలకేతర స్థిరాస్తులను విక్రయించనున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి రెండు కంపెనీలు రూ. 37,500 కోట్ల స్థిరాస్తులను గుర్తించి, విక్రయించనున్నాయి.