బీఎస్ఎన్ఎల్ నుంచి ఆకర్షణీయ ఆఫర్లు

ABN , First Publish Date - 2021-12-27T03:02:21+05:30 IST

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. వీటిలో..

బీఎస్ఎన్ఎల్ నుంచి ఆకర్షణీయ ఆఫర్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. వీటిలో దీర్ఘకాలిక ప్లాన్లతోపాటు అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందించే ప్లాన్లు కూడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన మిగతా ప్లాన్లతో పోలిస్తే రూ. 599తో తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ మరింత ఆకట్టుకునేలా ఉంది.


ఈ ప్లాన్‌లో రోజుకు 5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జింగ్ మ్యూజిక్‌ యాక్సెస్ లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్‌లో ఉన్న మరో అద్భుత ఆఫర్.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 84 రోజులు ఉండడం వినియోగదారులను మరింత ఆకర్షించే అంశం.


బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన తీసుకొచ్చిన రూ. 2,399 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 425 రోజులు. ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ అపరిమితంగా లభిస్తాయి. రూ. 1999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తంగా 600 జీబీ, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, రెండు నెలల వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్, ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. కాలపరిమితి 365 రోజులు. 

Updated Date - 2021-12-27T03:02:21+05:30 IST