మరో సంచలనానికి తెరలేపిన అపరకుబేరుడు ఈలాన్ మస్క్!

ABN , First Publish Date - 2021-02-09T01:48:41+05:30 IST

అపరకుబేరుడు టెస్లా, స్పెస్‌ఎక్స్ సంస్థల అధినేత ఈలాన్ మస్క్ మాత్రం బిట్‌కాయిన్‌ అంటే అమితాశక్తి కనబరుస్తారు. భవిష్యత్తు బిట్‌కాయిన్‌దేనని బహిరంగంగా ప్రకటిస్తారు. తాజాగా ఆయన మరో సంచలనానికి తెరతీసారు.

మరో సంచలనానికి తెరలేపిన అపరకుబేరుడు ఈలాన్ మస్క్!

న్యూఢిల్లీ: బిట్ కాయిన్‌.. డిజిటల్ రూపంలో ఉండే క్రిప్టోకరెన్సీ..నగదుకు ప్రత్యామ్నాయంగా బాగా పాపులర్! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు సంబంధించి ఇదో హాట్ టాపిక్. ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ విలువ వేగంగా పెరగడంతో ఓదశలో దీని విలువ దాదాపు 50 వేల డాలర్ల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో అనేక మంది రాత్రికి రాత్రి కోటీస్వరులైపోయారు. అయితే.. ప్రభుత్వాల నియంత్రణలేని  క్రిప్టోకరెన్సీలపై ఏన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగదు అక్రమరవాణాకు మోసాలకు ఇది కారణం కాగలదనేది బిట్‌కాయిన్‌ ఎదుర్కొంటున్న ప్రధాన అవరోధం. 


కానీ.. అపరకుబేరుడు టెస్లా, స్పెస్‌ఎక్స్ సంస్థల అధినేత ఈలాన్ మస్క్ మాత్రం బిట్‌కాయిన్‌ అంటే అమితాశక్తి కనబరుస్తారు. భవిష్యత్తు బిట్‌కాయిన్‌దేనని బహిరంగంగా ప్రకటిస్తారు. తాజాగా ఆయన మరో సంచలనానికి తెరతీసారు. ఆయన సార్థథ్యంలోని కార్పొరేట్ దిగ్గజం టెస్లా బిట్‌కాయిన్‌పై ఇటీవల ఏకంగా 1.5 బిలియన డాలర్ల పెట్టుబడి గుమ్మరించింది. ఓ కార్పొరేట్ సంస్థ ఈ స్థాయిలో బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టడం చరిత్రలో ఇదే ప్రథమం. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో బిట్‌కాయిన్‌ కున్న డిమాండ్ మరింత పెరిగింది. టెస్టా పెట్టుబడి గురించి బహిర్గతమైన వెంటనే దాని విలువ 15 శాతం మేర పెరిగి 44 వేల డాలర్లకు చేరుకుంది.  ‘టెస్లా అధినేత లాంటి అపరకుబేరు తన కంపెనీతో వేల డాలర్ల పెట్టుబడి పెట్టిండాన్ని బట్టి బిట్‌కాయిన్‌‌పై సానుకూల వైఖరి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని మార్కెట్ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక 2022 నాటికల్లా ఎస్ అండ్ పీ జాబితాలోని తొలి 500 కంపెనీల్లో కనీసం 10 శాతం బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బిట్‌కాయిన్ విలువ అనేక మార్లు ఒడిదుడుకులకు లోనైన అంశం మదుపర్లను ఇప్పటికీ ఆందోళనకు గురిచేస్తోంది.  

Updated Date - 2021-02-09T01:48:41+05:30 IST