భారీగా పడిపోయిన బిట్ కాయిన్ ధర..!

ABN , First Publish Date - 2021-06-23T03:06:20+05:30 IST

క్రిప్టోకరెన్సీ మార్కెట్ గత కొద్ది రోజులుగా భారీ కుదుపులకు లోనవుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.

భారీగా పడిపోయిన బిట్ కాయిన్ ధర..!

ముంబై: క్రిప్టోకరెన్సీ మార్కెట్ గత కొద్ది రోజులుగా భారీ కుదుపులకు లోనవుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా 64 వేల డాలర్లకు ఎగబాకిన బిట్ కాయిన్ తాజాగా అత్యంత కనిష్టానికి చేరుకుంది. క్రిప్టోమైనింగ్ కొరకు విద్యుత్ వినియోగం అధికమవుతోందంటూ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయడం బిట్ కాయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. దీనికి తోడు చైనా ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతుండటంతో..ఈ కరెన్సీ విలువ నానాటికీ దిగజారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇన్వెస్టర్ల జేబూల్లో పడిన లాభాలన్నీ ఒక్కసారిగా తుడిచి పెట్టుకుపోయాయి. 

Updated Date - 2021-06-23T03:06:20+05:30 IST