బిట్ కాయిన్... 60 వేల డాలర్లు...

ABN , First Publish Date - 2021-11-01T02:09:33+05:30 IST

కాయిన్ విలువ ఆదివారం 60,657.40 డాలర్లు. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65 వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

బిట్ కాయిన్... 60 వేల డాలర్లు...

ముంబై : బిట్ కాయిన్ విలువ ఆదివారం 60,657.40 డాలర్లు. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65 వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో కొనసాగింది. ఆ తర్వాత జులై నెలలో 30 వేల డాలర్ల దిగువకు కూడా పడిపోయింది.


అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ, కొద్ది నెలల పాటు 30-50 వేల డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50 వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. ఇక 55 వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62 వేలను దాటి, ఇప్పుడు 66 వేల డాలర్లను అధిగమించింది. ఆ తర్వాత 60 వేల స్థాయికి తగ్గిపోయింది. 

Updated Date - 2021-11-01T02:09:33+05:30 IST