టాటా సూపర్ యాప్‌లోకి బిగ్‌బాస్కెట్!
ABN , First Publish Date - 2021-02-17T11:51:37+05:30 IST
దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా సరుకుల ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్ చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను రూ.9,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ ...
రూ.9,500 కోట్లకు 68% వాటా కొనుగోలు
ముంబై: దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా సరుకుల ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్ చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను రూ.9,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్‌కు పోటీగా టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తులు, సేవలను ఒకే వేదిక ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని టాటా గ్రూప్ భావిస్తోంది.