లాభాల్లోకి భారతి ఎయిర్‌టెల్
ABN , First Publish Date - 2021-08-04T08:21:31+05:30 IST
భారతి ఎయిర్‌టెల్ జూన్ త్రైమాసికంలో లాభాల్లోకి ప్రవేశించింది గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,933 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.284 కోట్ల కన్సాలిడేటెడడ్ లాభాన్ని నమోదు చేసింది.
ముంబై : భారతి ఎయిర్‌టెల్ జూన్ త్రైమాసికంలో లాభాల్లోకి ప్రవేశించింది గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,933 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.284 కోట్ల కన్సాలిడేటెడడ్ లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం 15.3 శాతం పెరిగి రూ.26,854 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై కంపెనీకి లభిస్తున్న ఆదాయం (ఆర్పు) రూ.146 ఉంది. గత ఏడాది క్యూ1లో ఆర్పు రూ.138గా ఉంది. ఆర్పు పెరగడం నాణ్యమైన కస్టమర్లు లభించారనేందుకు సంకేతమని పేర్కొంది. కంపెనీ ఆటుపోట్లను తట్టుకుని నిలబడిందనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపింది.