15000 వద్ద పరీక్ష -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-02-08T06:49:51+05:30 IST

నిఫ్టీ గత వారం బలమైన అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తూ 15000 వరకు వెళ్లి నిలకడగా ముగిసింది. వరుసగా ఐదు రోజులూ లాభాలతోనే ట్రేడయి 10 శాతం లేదా 1300 పాయింట్ల వరకు లాభపడింది. టెక్నికల్‌గా కొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేసినందు వల్ల స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి...

15000 వద్ద పరీక్ష  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం బలమైన అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తూ 15000 వరకు వెళ్లి నిలకడగా ముగిసింది. వరుసగా ఐదు రోజులూ లాభాలతోనే ట్రేడయి 10 శాతం లేదా 1300 పాయింట్ల వరకు లాభపడింది.  టెక్నికల్‌గా కొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేసినందు వల్ల స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. ఆర్‌ఎ్‌సఐ సూచీలు కూడా 80 శాతం వద్ద ఉండడం ఓవర్‌బాట్‌ స్థితిని సూచిస్తోంది. కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. టెక్నికల్‌గా పాజిటివ్‌గానే ఉన్నా ఓవర్‌హీట్‌ స్థితి కారణంగా గరిష్ఠ స్థాయిల్లో పొజిషన్ల విషయంలో స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. మానసిక అవధి 15000 వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది.


బుల్లిష్‌ స్థాయిలు: 15000 వద్ద కన్సాలిడేషన్‌ ఏర్పడవచ్చు. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన సరికొత్త గరిష్ఠ స్థాయిల్లోకి పురోగమిస్తుంది.

బేరిష్‌ స్థాయిలు: 15000 వద్ద విఫలమైతే బలహీనతకు ఆస్కారం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 14700. అంతకన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 14400.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా రికార్డు స్థాయిలో 5500 పాయింట్ల ర్యాలీ సాధించింది. ప్రధాన నిరోధం 36500. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమైతే బలహీనత ముప్పు ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 35500. 

పాటర్న్‌: 15000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయిని బ్రేక్‌ చేయాలి. నిఫ్టీ ‘‘ఎగువకు కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా చాలా పైన ఉంది. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం సోమ, గురు వారాల్లో తదుపరి రివర్సల్స్‌ ఉన్నాయి.


సోమవారం స్థాయిలు

నిరోధం : 15020, 15075 

మద్దతు : 14900, 14840


www.sundartrends.in

వి. సుందర్‌ రాజా

Updated Date - 2021-02-08T06:49:51+05:30 IST