బీడీఆర్ ఫార్మాకు బారిసిటినిబ్ తయారీ లైసెన్స్
ABN , First Publish Date - 2021-05-20T05:45:55+05:30 IST
తాజాగా కొవిడ్ చికిత్సకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన బారిసిటినిబ్‌ను మరో కంపెనీ తయారు చేయనుంది. ఎలి లిల్లీతో బీడీఆర్ ఫార్మా రాయల్టీ ఫ్రీ, లిమిటెడ్, నాన్ ఎక్స్‌క్లూజివ్ వాలంటెరీ ఒప్పందం కుదుర్చుకుంది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తాజాగా కొవిడ్ చికిత్సకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన బారిసిటినిబ్‌ను మరో కంపెనీ తయారు చేయనుంది. ఎలి లిల్లీతో బీడీఆర్ ఫార్మా రాయల్టీ ఫ్రీ, లిమిటెడ్, నాన్ ఎక్స్‌క్లూజివ్ వాలంటెరీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో బారిసిటినిబ్ లభ్యత పెరగడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బీడీఆర్ ఫార్మా చైర్మన్ ధర్మేష్ షా అన్నారు.