బ్యాంకుల బ్యాడ్ లోన్‌లు పెరుగుతాయా ?

ABN , First Publish Date - 2021-03-24T23:18:54+05:30 IST

లోన్ మారటోరియం, ఎన్పీఏలకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల నేపధ్యంలో బ్యాంకుల బ్యాడ్ లోన్‌లు రూ. 1.13 లక్షల కోట్ల మేర పెరగవచ్చని భావిస్తున్నారు.

బ్యాంకుల బ్యాడ్ లోన్‌లు పెరుగుతాయా ?

న్యూఢిల్లీ : లోన్ మారటోరియం, ఎన్పీఏలకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల నేపధ్యంలో బ్యాంకుల బ్యాడ్ లోన్‌లు రూ. 1.13 లక్షల కోట్ల మేర పెరగవచ్చని భావిస్తున్నారు. అలాగే, రూ. 2 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారికి కూడా మారటోరియం వ్యవధిలో చక్రవడ్డీని మాఫీ చేయాలన్న సుప్రీం ఆదేశాలతో రుణదాతలపై అదనంగా రూ. 7500 కోట్ల వరకు భారం పడవచ్చని ఆర్ధికరంగనిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ మాఫీ సాధ్యం కాదని, మారటోరియం పొడిగింపు కూడా ఉండదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే వడ్డీ మీద వడ్డీ మాఫీ మాత్రం ఉంటుందని పేర్కొంది.


రంగంలోకి ఆర్థిక శాఖ... 

గతంలో రూ. 2 కోట్లకు తక్కువగా రుణాలున్న వారికి మారటోరియం కాలంలో వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా రుణగ్రహీతలందరికీ అంటే రూ. 2 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తింప చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకులపై ఈ భారం పడనుంది. 


ఇక వారికీ చెల్లింపు...

రుణగ్రహీతల తాజా భారం రూ. 7 వేల కోట్ల నుండి రూ. 7,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే చక్రవడ్డీకి సంబంధించి రుణగ్రహీతలకు కాంపెన్సేషన్ చెల్లించిన నేపధ్యంలో... సుప్రీం నిర్ణయంతో త్వరలో రూ. 2 కోట్లకు మించి తీసుకున్న రుణగ్రహీతలకు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తున్నారు.


Updated Date - 2021-03-24T23:18:54+05:30 IST