ఎన్‌ఎఫ్‌‌సీఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ

ABN , First Publish Date - 2021-09-02T08:02:15+05:30 IST

నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌)పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది.

ఎన్‌ఎఫ్‌‌సీఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌)పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిసొల్యూషన్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ)కు ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31న ఆదేశాలు అందినట్లు కంపెనీ వెల్లడించింది. దాదాపు రూ.17 కోట్ల బకాయిల వసూలుకు సంబంధించి స్విట్జర్లాండ్‌కు చెందిన కీ ట్రేడ్‌ ఏజీ (ఆపరేషనల్‌ క్రెడిటర్‌) దాఖలు చేసిన పిటిషన్‌కు అనుగుణంగా బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. చెరుకూరి వెంకట రత్నబాబును ఇంటెరిమ్‌ రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ)గా నియమించింది. 

Updated Date - 2021-09-02T08:02:15+05:30 IST