ఈ-కామర్స్‌ ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం!

ABN , First Publish Date - 2021-06-22T05:36:27+05:30 IST

ఈ-కామర్స్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ కామర్స్‌

ఈ-కామర్స్‌ ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం!

 ఆన్‌లైన్‌ సైట్ల మిస్‌ సెల్లింగ్‌కూ చెక్‌

 ఇక నిబంధనలు  కఠినతరం 


న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ కామర్స్‌ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్‌ సెల్లింగ్‌, మోసపూరిత ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) వద్ద ఈ కంపెనీల రిజిస్ట్రేషన్‌ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ రిజల్ట్స్‌ను మోసపుచ్చి యూజర్లను తప్పుదోవ పట్టించడంపై నిషేధంతో పాటు కస్టమర్ల ఇబ్బందులను పరిష్కరించేందు కు ఈ-కామర్స్‌ సైట్లు చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ గ్రీవియెన్స్‌ ఆఫీసర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలన్నది మరో ప్రతిపాదన.


ఏదేని చట్టం కింద నేర నివారణ, గుర్తిం పు,దర్యాప్తు, విచారణకు సంబంధించి ఏ ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఆదేశాలు అందుకున్న 72 గంటల్లో ఈ-కామర్స్‌ వేదికలు అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్‌) నిబంధన లు, 2020లో ప్రభుత్వం పలు సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై 15 రోజుల్లో (జూలై 6 నాటికి) అభిప్రాయాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది.


Updated Date - 2021-06-22T05:36:27+05:30 IST