అలా చేయొద్దు... బజాజ్ ఫైనాన్స్

ABN , First Publish Date - 2021-10-11T21:37:56+05:30 IST

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ... బజాజ్ ఫైనాన్స్ తాజాగా తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

అలా చేయొద్దు... బజాజ్ ఫైనాన్స్

హైదరాబాద్ : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ...   బజాజ్ ఫైనాన్స్ తాజాగా తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఆన్‌లైన్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్న నేపధ్యంలో...  జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో మోసపోవాల్సి రావొచ్చని హెచ్చరించింది. బజాజ్ ఈఎంఐ కార్డు వాడే వారు అలర్ట్‌గా ఉండాలని బజాజ్ ఫైనాన్స్ కోరుతోంది. బజాజ్ కార్డు ద్వారా గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయడం వీలు కాదని స్పష్టం చేసింది. 


అలాంటి సైట్లలో బజాజ్ ఈఎంఐ కార్డు నంబరు, ఓటీపీ వంటివి ఎంటర్ చేయవద్దని కోరింది. అలాగే... బజాజ్ కార్డు ద్వారా గిఫ్ట్ కార్డులు కొనొచ్చని ఎవరైనా చెప్పినప్పటికీ... వారి మాటలు నమ్మవద్దని తెలిపింది. లేదంటే మోసపోవాల్సి రావచ్చని హెచ్చరించింది.

Updated Date - 2021-10-11T21:37:56+05:30 IST