బజాజ్‌ అలియాంజ్‌ ‘హెల్త్‌ ప్రైమ్‌ రైడర్‌’

ABN , First Publish Date - 2021-12-19T08:06:09+05:30 IST

బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ అనుబంధ సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ భాగస్వామ్యంలో ‘హెల్త్‌ ప్రైమ్‌ రైడర్‌’ను మార్కెట్లోకి తెచ్చింది....

బజాజ్‌ అలియాంజ్‌ ‘హెల్త్‌ ప్రైమ్‌ రైడర్‌’

బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ అనుబంధ సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ భాగస్వామ్యంలో ‘హెల్త్‌ ప్రైమ్‌ రైడర్‌’ను మార్కెట్లోకి తెచ్చింది. టెలీ కన్సల్టేషన్‌, డాక్టర్‌ కన్సల్టేషన్‌, వైద్య పరీక్షలు, వార్షిక ప్రివెంటివ్‌ హెల్త్‌ చెక్‌పలు అన్నింటికీ క్యాష్‌లెస్‌ కవరేజీని ఈ పాలసీ కల్పిస్తుంది. ఈ సదుపాయాలన్నీ ‘కేరింగ్లీ యువర్స్‌’ యాప్‌ ద్వారా డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. దేశంలో 2500 లాబ్‌లు, 90 వేల మంది డాక్టర్లు, 35 మంది స్పెషలిస్టుల వద్ద ఈ సౌకర్యాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. రెండు వేరియెంట్లు, ఆరు ప్లాన్లు ఉండే ఈ పాలసీ ప్రీమియం రూ.63 నుంచి రూ.1084 మధ్య, ఫ్లోటర్‌ ప్రాతిపదికన మూడు ప్లాన్ల ప్రీమి యం రూ.1,146 నుంచి రూ.2,348 మధ్యన ఉంటుంది. ఈ రైడర్‌ ప్లాన్‌ను బజాజ్‌ అలియాంజ్‌కు చెందిన ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలతో కలిపి తీసుకోవచ్చు. ప్రస్తుత కస్టమర్లు కూడా తమ పాలసీల రెన్యువల్‌ సమయంలో ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. 

Updated Date - 2021-12-19T08:06:09+05:30 IST