మెట్రోకెమ్‌కు అవార్డు
ABN , First Publish Date - 2021-02-26T09:53:30+05:30 IST
గత (2020) ఏడాదికి హైదరాబాద్‌కు చెందిన మెట్రోకెమ్ ఏపీఐ కంపెనీకి ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియా ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత (2020) ఏడాదికి హైదరాబాద్‌కు చెందిన మెట్రోకెమ్ ఏపీఐ కంపెనీకి ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియా ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఏపీఐ బల్క్ డ్రగ్స్ అభివృద్ధి, తయారీలో చేసిన విశేష కృషికి ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నుంచి మెట్రోకెమ్ ఏపీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర రావు అవార్డును అందుకున్నారు. కంపెనీ దాదాపు పదిహేడేళ్లుగా 65 రకాల ఏపీఐ, ఇంటర్మీడియెట్లు, 35 పిల్లెట్లను తయారు చేస్తోంది.