‘ఆటో’లో చిప్‌ కల్లోలం

ABN , First Publish Date - 2021-11-02T08:12:47+05:30 IST

చిప్‌ల కొరత ఆటోమొబైల్‌ కంపెనీలను తీవ్రంగా కుంగదీసింది. అక్టోబరు నెలలో ప్రధాన కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోయాయి...

‘ఆటో’లో చిప్‌ కల్లోలం

భారీగా తగ్గిన అక్టోబరు అమ్మకాలు

న్యూఢిల్లీ: చిప్‌ల కొరత ఆటోమొబైల్‌ కంపెనీలను తీవ్రంగా కుంగదీసింది. అక్టోబరు నెలలో ప్రధాన కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోయాయి.మారుతి సుజు కీ, హ్యుండయ్‌ అమ్మకాల్లో  రెండంకెల పతనాన్ని చవిచూశాయి. అయితే టాటా మోటార్స్‌, మహీంద్రా, నిస్సా న్‌, స్కోడా మాత్రం అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశా యి. టాటా మోటార్స్‌ అమ్మకాలు గత అక్టోబరుతో పోల్చితే అమ్మకాలు 23,617 నుంచి 33,925 (44%)కి పెరిగాయి. మహీంద్రా అమ్మకాలు 8ు పెరిగి 20,130కి చేరాయి. అక్టోబరులో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు 32 శాతం దిగజారి 1,72,862 యూనిట్ల నుంచి 1,17,013 యూనిట్లకు పడిపోయాయి. హ్యుండయ్‌ విక్రయాలు కూడా 35 శాతం తగ్గి 37,021 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా ఇండియా (22%), హోండా కార్స్‌ (25%),ఎంజీ మోటార్స్‌(24%) అమ్మకాల్లో  క్షీణత నమోదైంది. మరోవైపు బజాజ్‌ ఆటో విక్రయాలు 14ు, టీవీఎస్‌ మోటార్‌ (10%), సుజుకీ మోటార్‌సైకిల్‌ (10%), హీరో మోటో కార్ప్‌ (32%) క్షీణించాయి. 

Updated Date - 2021-11-02T08:12:47+05:30 IST