ఉబెర్... యాప్‌లో ఇక ఆడియో రికార్డింగ్...

ABN , First Publish Date - 2021-12-10T00:41:06+05:30 IST

రైడర్లు, డ్రైవర్ల భద్రత కోసం ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను ప్రకటించింది ఉబెర్. , ప్రయాణం సమయంలో... ఆడియోను రికార్డింగ్‌కు వినియోగదారులను ఈ ఫీచర్ అనుమతిస్తుంది.

ఉబెర్... యాప్‌లో ఇక ఆడియో రికార్డింగ్...

ముంబై : రైడర్లు, డ్రైవర్ల భద్రత కోసం ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను ప్రకటించింది ఉబెర్. , ప్రయాణం సమయంలో... ఆడియోను రికార్డింగ్‌కు వినియోగదారులను ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ను... డ్రైవర్, రైడర్ ఇద్దరూ ఉపయోగించవచ్చు. ఉబెర్‌లో...  ఆడియో రికార్డింగ్ ఫీచర్ ఇప్పుడు ప్రస్తుతం... మెక్సికో, బ్రెజిల్‌తో సహా పధ్నాలుగు దేశాల్లో అందుబాటులో ఉంది. ఇక... అమెరికాలోని మూడు నగరాల్లో ఉబెర్ తన కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనుంది. భారతదేశంలో ఈ ఫీచర్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.  యాప్‌లోని సేఫ్టీ టూల్‌కిట్‌లోని షీల్డ్ ఐకాన్‌పై నొక్కడంతోపాటు, ‘రికార్డ్ ఆడియో’ను  ఎంచుకోవడం ద్వారా వినియోగదారుడు... ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు.


రైడర్, డ్రైవర్ ఇద్దరూ కూడా వేర్వేరుగా...  ప్రయాణాన్ని రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా...  డ్రైవర్‌, రైడర్‌ల ‘సెర్చ్’లో కూడా రికార్డింగ్ ఫీచర్‌ను ‘ఆన్‌’లో ఉంచుకోవచ్చు. అంటే... డ్రైవర్ రికార్డింగ్ ప్రారంభించినప్పుడు రైడర్‌కు కూడా తెలిసిపోతుంది. ఉబెర్ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘రైడర్‌లు, డ్రైవర్‌లు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత, మ్యాప్ స్క్రీన్‌పై ఉన్న షీల్డ్ సింబల్‌ను నొక్కి, ‘రికార్డ్ ఆడియో”ను ఎంచుకోవడం ద్వారా... ఆడియో  రికార్డింగ్ మొదలుపెట్టుకోవచ్చు. రైడర్‌లు, డ్రైవర్‌లు వ్యక్తిగతంగా ట్రిప్పుల రికార్డింగ్ కూడా చేసుకోవచ్చకు. డ్రైవర్‌లు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణానికి ముందు, డ్రైవర్ ఈ ఫీచర్‌ను  ఎంచుకున్నారో లేదో మేము రైడర్‌కు వారి యాప్‌లో తెలియజేస్తాము. ఆడియో ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది’ అని వివరించారు. ఇక... ఆడియో ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఉబెర్‌ సహా వేరెవరూ కూడా ఫైల్‌ను యాక్సెస్ చేసే అవకాశముండదు. మరికొద్ది రోజుల్లో భారత్ లోని ప్రధాన నగరాల్లో కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. 

Updated Date - 2021-12-10T00:41:06+05:30 IST