ప్రస్తుతం జీడీపీ వృద్ధే కీలకం

ABN , First Publish Date - 2021-03-14T06:26:46+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం, స్వయం సమృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోన్న భారత్‌కు ప్రస్తుతం జీడీపీ వృద్ధి అత్యవసరమని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో కొంత రాజీపడైనా ఆర్థిక

ప్రస్తుతం జీడీపీ వృద్ధే కీలకం

ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ 


కోల్‌కతా: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం, స్వయం సమృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోన్న భారత్‌కు ప్రస్తుతం జీడీపీ వృద్ధి అత్యవసరమని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో కొంత రాజీపడైనా ఆర్థిక వ్యవస్థను మళ్లీ వృద్ధి పథంలో పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 31లోగా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన నియమావళి, ద్రవ్యోల్బణ లక్ష్యాల సవరణ నేపథ్యంలో సుబ్రమణియన్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి( 2 శాతం ఎక్కువ లేదా తక్కువ వెసులుబాటుతో) పరిమితం చేయాలని కేంద్ర ప్రభు త్వం 2016 జూన్‌లో ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Updated Date - 2021-03-14T06:26:46+05:30 IST