డీల్ ఖరారు... ‘వీ-మార్ట్’ చేతికి ‘అరవింద్ లైఫ్ స్టైల్’
ABN , First Publish Date - 2021-07-22T21:36:27+05:30 IST
అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు చెందిన అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అన్నీ ఇకపై వీ-మార్ట్ హస్తగతం కానున్నాయి.
న్యూఢిల్లీ : అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు చెందిన అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అన్నీ ఇకపై వీ-మార్ట్ హస్తగతం కానున్నాయి. ఇందుకు సంబంధించిన డీల్ దాదాపుగా ఇప్పటికే పూర్తైయ్యింది. వీ మార్ట్ రిటైల్‌కు అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్‌ను క్యాష్ ట్రాన్సాక్షన్ డీల్ విషయమై వీ-మార్ట్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘నార్త్, ఈస్ట్రన్ ఇండియాలలో వీ-మార్ట్ బలమైన సంస్థల్లో ఒకటి. ఫ్యాషన్ విభాగంలో ప్రజలకు అత్యంత విలువైన రిటైల్ ప్లేయర్ ఇది. ప్రధానంగా టైర్ 2, 3 నగరాల్లో ఎక్కువగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
వీ-మార్ట్ సంస్థ కిందకే అన్లిమిటెడ్ స్టోర్స్‌ను చేర్చడం మాకు చాలా గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. అరవింద్ లైఫ్ స్టైల్.. సౌత్, వెస్ట్ ఇండియాల్లో 74 విలువైన ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. వీ-మార్ట్‌తో జరిపిన డీల్‌లో భాగంగా అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ 74 రిటైల్ స్టోర్స్, వేర్‌హౌసెస్, ఇన్వెంటరీ, ‘అన్లిమిటెడ్’ బ్రాండ్లను వీ-మార్ట్‌కు విక్రయిస్తుందని కంపెనీ గురువారం వెల్లడించింది.