నిరోధ స్థాయిలకు చేరువలో...

ABN , First Publish Date - 2021-05-24T09:27:25+05:30 IST

నిఫ్టీ టెక్నికల్‌గా గత ఐదు వారాలుగా కనిపిస్తున్న మైనర్‌ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ గత వారం బలమైన బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. గత కొద్ది వారాలుగా నిలకడగా

నిరోధ స్థాయిలకు చేరువలో...

నిఫ్టీ టెక్నికల్‌గా గత ఐదు వారాలుగా కనిపిస్తున్న మైనర్‌ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ గత వారం బలమైన బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. గత కొద్ది వారాలుగా నిలకడగా పురోగమిస్తూ 1000 పాయింట్ల మేరకు లాభపడి ప్రధాన నిరోధ స్థాయిలు 15300-15500 సమీపంలో నిలిచింది. గత మూడు నెలల కాలంలో ఇక్కడ మూడు టాప్‌లు ఏర్పడ్డాయి. అందువల్ల గరిష్ఠ స్థాయిల్లో పలు నిరోధాలు ఏర్పడ్డాయి. గతంలో చేసిన పలు ప్రయత్నాల్లో ఈ నిరోధాలను దాటలేక పోయినందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. గత వారంలో నిఫ్టీ 50, 100 డిఎంఏల కన్నా పైనే రికవరీ అయింది. తదుపరి దిశ తీసుకునే ముందు గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్‌ కావచ్చు. 


బుల్లిష్‌ స్థాయిలు: 15000 దాటినందు వల్ల పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌ ఉండవచ్చు. సానుకూలత కోసం ఈ రియాక్షన్‌లో కూడా ఆ స్థాయి కన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 15200, 15350. ఈ నిరోధాల కన్నా పైన నిలదొక్కుకుంటే కీలక నిరోధం 15500 దిశగా పురోగమిస్తుంది.


బేరిష్‌ స్థాయిలు: 15000 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 14700, 14400, 14000.  


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం బలమైన ర్యాలీలో పడిన ఈ సూచి 2450 పాయింట్ల రికార్డు లాభంతొ 34600 సమీపంలో క్లోజైంది. మానసిక అవధి 35000కి చేరువవుతోంది.


పాటర్న్‌: 15000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ప్రధాన మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. కాని ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా చాలా పైన ఉన్నందు వల్ల తక్షణ ముప్పు లేదు. మరింత అప్‌ట్రెండ్‌ కోసం 15350 వద్ద ‘‘డబుల్‌ టాప్‌’’ బ్రేక్‌ చేయాలి.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉంది. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 15130, 15200 

మద్దతు : 15600, 15000


Updated Date - 2021-05-24T09:27:25+05:30 IST