యాపిల్‌ ప్రపంచ నం.1

ABN , First Publish Date - 2021-08-21T07:30:03+05:30 IST

ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్‌ కంపెనీల్లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ నం.1గా

యాపిల్‌  ప్రపంచ నం.1

ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్‌ కంపెనీల్లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ నం.1గా నిలిచింది. కంపెనీ మార్కెట్‌ విలువ 2,44,300 కోట్ల డాలర్లుగా నమోదైంది. మైక్రోసాఫ్ట్‌ (2,11,400 కోట్ల డాలర్లు), అమెజాన్‌ (180,200 కోట్ల డాలర్లు), ఆల్ఫాబెట్‌ (1,73,300 కోట్ల డాలర్లు), ఫేస్‌బుక్‌ (96,700 కోట్ల డాలర్లు) వరుసగా టాప్‌-5 స్థానాల్లో నిలిచాయి. హురున్‌ గ్లోబల్‌ 500 లిస్ట్‌లోని కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ 58 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది.


గత ఏడాది కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి వీటి విలువ 18 లక్షల కోట్ల (45 శాతం) మేర పెరిగిందని హురున్‌ వెల్లడించింది. ఈ టాప్‌-500 కంపెనీల మొత్తం విక్రయాలు 18.4 లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఇది చైనా జీడీపీ కంటే అధికం. ఐదు వందల కంపెనీల్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.3 కోట్లు. జర్మనీలోని మొత్తం కార్మిక శక్తి కంటే అధికమిదని హురున్‌ రిపోర్టు తెలిపింది. 


Updated Date - 2021-08-21T07:30:03+05:30 IST