యాపిల్‌ కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో మోడళ్లు

ABN , First Publish Date - 2021-10-20T07:58:28+05:30 IST

అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌.. మ్యాక్‌బుక్‌ ప్రో శ్రేణిలో కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్‌ పేర్లతో ఆవిష్కరించిన కొత్త ల్యాప్‌టా్‌పలను 14, 16 అంగుళాల సైజుల్లో అందుబాటులోకి తెచ్చింది.

యాపిల్‌ కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో మోడళ్లు

 ప్రారంభ ధర రూ.1.95 లక్షలు 

న్యూఢిల్లీ: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌.. మ్యాక్‌బుక్‌ ప్రో శ్రేణిలో కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్‌ పేర్లతో  ఆవిష్కరించిన కొత్త ల్యాప్‌టా్‌పలను 14, 16 అంగుళాల సైజుల్లో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో ధర రూ.1.95 లక్షలు కాగా, 16 అంగుళాల మోడల్‌ రేటు రూ.2.4 లక్షలు. యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా వీటిని ఆర్డర్‌ చేయవచ్చు. భారత కస్టమర్లకు, కంపెనీ రీసెలర్లకు ఈనెల 26 నుంచి వీటి సరఫరా ప్రారంభమవుతుందని యాపిల్‌ తెలిపింది. గత మోడళ్ల కంటే మరింత మెరుగైన, వేగవంతమైన పనితీరుతోపాటు ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్‌ 1080 పిక్సెల్‌ కెమెరా, సిక్స్‌ స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, మూడో తరం ఎయిర్‌పాడ్స్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. వీటి ధర రూ.18,500. సరికొత్త స్మార్ట్‌ స్పీకర్‌ ‘హోమ్‌పాడ్‌ మినీ’ని సైతం విడుదల చేసింది. వచ్చేనెలలో అందుబాటులోకి రానున్న ఈ స్పీకర్‌  రూ.9,900కు లభించనుంది. 

Updated Date - 2021-10-20T07:58:28+05:30 IST