ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 21 నుంచి ఈ సేవలుండవు.

ABN , First Publish Date - 2021-03-22T21:01:04+05:30 IST

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా ? ఉంటే... కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏప్రిల్ 21 నుంచి కొన్ని సర్వీసులును ఈ బ్యాంకు నిలిపివేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కార్డ్ షీల్డ్ అప్లికేషన్‌ గురించి బ్యాంకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది.

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 21 నుంచి ఈ సేవలుండవు.

ముంబై : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  అకౌంట్ ఉందా ? ఉంటే... కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏప్రిల్ 21 నుంచి కొన్ని సర్వీసులును ఈ బ్యాంకు నిలిపివేస్తోంది. వివరాలిలా ఉన్నాయి.  కార్డ్ షీల్డ్ అప్లికేషన్‌ గురించి బ్యాంకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 21 తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండబోవు. ఈ క్రమంలో... సంబంధిత యాప్ కనిపించబోదు. అంటే... బ్యాంక్ కస్టమర్లు ఏప్రిల్ 21 లోపు ఇలా  చేయకపోతే... తర్వాతి రోజు నుంచి కార్డు పని చేయదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారాఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ ఈ సర్వీసులను బీఓఐ మొబైల్ యాప్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో అనుసంధానం చేస్తోంది.


బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు షీల్డ్ ద్వారా ఖాతాదారులు తమ  డెబిట్ కార్డును కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా డెబిట్ కార్డు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఒకవేళ కార్డును ఎక్కడైనా మరచిపోయినట్లైతే... దానిని ఆఫ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. కార్డుపై లిమిట్ సెట్ చేసుకోవచ్చు కూడా. అంతేకాదు... ఇతరత్రా మరికొన్ని సర్వీసులను కూడా బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది. 

Updated Date - 2021-03-22T21:01:04+05:30 IST