కంపెనీలకు ఎయిర్‌టెల్ వీడియో స్ట్రీమింగ్ సేవలు
ABN , First Publish Date - 2021-10-20T07:56:17+05:30 IST
డియో స్ట్రీమింగ్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా కార్పొరేట్ ఖాతాదారుల కోసం ‘ఎయిర్‌టెల్ ఐక్యూ వీడియో’ పేరుతో ఎయిర్‌టెల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వీడియో స్ట్రీమింగ్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా కార్పొరేట్ ఖాతాదారుల కోసం ‘ఎయిర్‌టెల్ ఐక్యూ వీడియో’ పేరుతో ఎయిర్‌టెల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఏ సర్వీస్ (సీపీఏఏఎస్) ప్రాతిపదికన ఈ సేవలను అందిస్తుంది. కంపెనీలు తక్కువ మౌలిక సదుపాయాలు, పెట్టుబడితో వీడియో స్ట్రీమింగ్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ దోహదం చేస్తుంది. ముందుగా ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు ఓటీటీ వీడియో సేవలను అందించడానికి ఇది ఉపయోగపడుతుందని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ అన్నారు. విద్యా రంగంలోని కంపెనీలు కూడా ఆన్‌లైన్ క్లాస్‌లకు ‘ఎయిర్‌టెల్ ఐక్యూ వీడియో’ సేవలను వినియోగించుకోవచ్చన్నారు.